బంజారాహిల్స్, డిసెంబర్ 25: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఈ నెల 17న హింసాత్మక ఘటనపై బిగ్బాస్ షో నిర్వహిస్తున్న ‘ఎండల్మోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించాలని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం, నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడంతో కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తున్నది.