Very Heavy Rains | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తం ప్రభావంతో రాష్ట్రంలో వర్సాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దక్షిణ, మధ్య పశ్చిమ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, హైదరాబాద్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని నాగరత్న వివరించారు.
Rains 01