MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ( MLA Sudheer Reddy) ఆరోపించారు. పాలన చేతకాక చేతులెత్తేసి రెండో పంట వేయవద్దన్న రేవంత్‌రెడ్డికి ప్రజలు రెండోసారి ఓటు వేయవద్దని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కక్ష సాధింపుతో మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్‌కు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని ఆరోపించారు.
కేంద్రం నుంచి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఏ నిర్ణయం రాకుండానే సంబురాలు చేసుకున్నారని పేర్కొన్నారు.మేడిగడ్డ మరమ్మతులు చేయడానికి మూడు నెలలు పట్టదని,మూడేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు రిపేర్లు అంటూ కాయాపన చేస్తున్నారని ఆరోపించారు.అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లు మంచిగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ రిసోర్స్ సంస్థ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేక, నీటిని నింపుకోలేక ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాల వల్ల హైదరాబాద్ నగరానికి త్రాగు నీటి కష్టాలు మొదలయ్యాయని ,ఇప్పటికే 2 లక్షల 30 వేల ట్యాంకర్లు వాడారని పేఒర్కన్నారు. సీఎం పీఠంపై కూర్చునే వ్యక్తులకు విశాల దృక్పథం ఉండాలని సూచించారు. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభిస్తే కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు.కేసీఆర్ ఆనవాళ్లు తుడపడం రేవంత్ రెడ్డితో సాధ్యం కాదని స్పష్టం చేశారు.ళేశ్వరం. ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని,అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక రకంగా మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

