RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveenkumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమయ్యా మెటా ఆఫీస్ పై దాడి జరిగింది.. మీరే హోంమంత్రి కదా అంటే.. హే అది చిన్న దాడి ఏముంది.. అని ముఖ్యమంత్రి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులను వెనకేసుకొచ్చే స్థాయికి ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య దిగజారిందన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveenkumar | హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫేస్ బుక్ మెటా ఆఫీస్ మీద దాడి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఓ చిట్‌చాట్ లో స్పందిస్తూ తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమయ్యా మెటా ఆఫీస్ పై దాడి జరిగింది.. మీరే హోంమంత్రి కదా అంటే.. హే అది చిన్న దాడి ఏముంది.. అని ముఖ్యమంత్రి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులను వెనకేసుకొచ్చే స్థాయికి ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య దిగజారిందన్నారు.
ఒక మాజీ పోలీసాఫీసర్‌గా ఈ మాట చెప్పేందుకు నాకు భయమేస్తున్నది.. కానీ ప్రజల సంక్షేమం కోసం ఈ మాట చెప్పాల్సిన అవసరముంది.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దయచేసి కళ్లు తెరచుకుని పాలన సాగిస్తడని ఆశతో ఈ మాట చెప్తున్నా..హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయని నవంబర్ 21 2026 నాడు జాయింట్ కమిషనర్ పోలీస్ బ్రాంచ్ నుండి పోలీసులందరికీ మెసేజ్ పోయింది. ఇది అంతర్గతంగా ఉండాల్సిన మెసేజ్.. ఇది మాక్కూడా రావాల్సిన అవసరం లేదు.. నేను పోలీస్ స్టేషన్లో సీఐని కాదు.. ఎస్ ఐని కాదు.. ఏసీపీ కాదు.. డీసీపీని కూడా కాదు. ఇది జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నుంచి నేరుగా పోయింది.. నేను కూడా రెండేళ్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌గా 2009 నుంచి 2011 దాకా పనిచేశా. ఇలాంటి మెసేజ్‌లు డైరెక్టుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఇవ్వొచ్చా.. అనేది మొదటి ప్రశ్న.. ఈ మెసేజ్ మాకు ఎక్కడో దొరకలేదు.. అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర..
హైదరాబాద్‌లో బాంబు దాడులు.. 300 మందిని చంపేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. భయబ్రాంతులకు గురికావొద్దు.. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండనే పుకార్లు మొదలైనయి.. వెంటనే హైదరాబాద్ పోలీసుల నుంచి దయచేసి పుకార్లను నమ్మకండి అంటూ వివరణ వచ్చింది.. వదంతులను నమ్మొద్దు.. మేమన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఈ మెయిల్‌ను వెరిఫై చేస్తున్నామని చెబుతారు.. ఈమెయిల్ అసలు ఒరిజినల్, ఫేక్ అనేది వెరిఫై చేస్తున్నాం. చేసిన తర్వాత దీనిపై యాక్షన్ తీసుకుంటమని డీజీపీ చెప్తరని అంటరన్నారు. అసలు అంతర్గతంగా ఉండాల్సిన మెసేజ్ సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చింది.. ఇలా వస్తే ప్రజలు భయపడరా..? దీనికి కారకులు ఎవరు? దీని మీద విచారణ జరపాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
మెటా ఆఫీసు మీద దాడిని స్వయంగా ముఖ్యమంత్రి సమర్థించే స్థాయికి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/ww0KvFD2ap
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయని నవంబర్ 21 2026 నాడు జాయింట్ కమిషనర్ పోలీస్ బ్రాంచ్ నుండి పోలీసులు అందరికీ మెసేజ్ పోయింది
ఈ మెసేజ్ కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి.. కానీ ఈ మెసేజ్ అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లిపోయింది
ఈ ఇంటర్నల్ మెసేజ్ బయటికి రాగానే, హైదరాబాద్ పోలీసులు వచ్చి ఇలాంటి పుకార్లు నమ్మకండని చెప్పారు
డీజీపీ గారు ఏమో ఈ మెసేజ్‌ను వెరిఫై చేయాలని చెప్పారు
అసలు అంతర్గతంగా ఉండాల్సిన మెసేజ్ సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చింది.. ఇలా వస్తే ప్రజలు భయపడరా?
దీనికి కారకులు ఎవరు? దీని మీద విచారణ జరపాలి
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Also :
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

