రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains )చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలలో నీరు నిండుగా చేరడంతో వ్యవసాయ పనుల్లో(Cultivation works) రైతన్నలు నిమగ్నమయ్యారు. పొలాలు దున్నుతూ, పంట చేలల్లో కలుపుతూ తీస్తూ బిజీ అయ్యారు. ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ సమీపంలో నాట్లు వేస్తుండగా ఈ చిత్రాన్ని నమస్తే తెలంగాణ క్లిక్ మనిపించింది.