హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ కంటైనర్‌లో 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంటైనర్ పెద్ద అంబర్పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్నదని చెప్పారు. గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా, మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.