కాలువలో పడి యువకుడు మృతి

Wed,October 9, 2019 10:00 AM

జనగామ: జిల్లాలోని లింగాలఘనపురం మండలం నేలపోగులలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు దేవాదుల కాల్వలో జారిపడి మృతి చెందాడు. మృతుడు నేలపోగుల గ్రామానికి చెందిన ఉపేందర్‌(26)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles