టిక్‌టాక్‌ వీడియో సరదా ప్రాణం తీసింది..

Thu,July 11, 2019 04:59 PM

టిక్‌టాక్‌ వీడియో ఓ యువకుడి ప్రాణాలమీదికొచ్చింది. మేడ్చల్‌ జిల్లా పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని దూలపల్లిలో ఉన్న ఓ చెరువులోకి నర్సింహా, ప్రశాంత్‌ అనే ఇద్దరు యువకులు దిగారు. ఇద్దరు యువకులు చెరువులో కాసేపు టిక్‌టాక్‌ వీడియో చేశారు. ఆ తర్వాత ప్రశాంత్‌ ఒడ్డు మీదకు వచ్చి నర్సింహాను వీడియో తీస్తుండగా..ఈత రాకపోవడంతో నర్సింహా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.


ప్రశాంత్‌ తన స్నేహితుడిని కాపాడాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ప్రశాంత్‌ పోలీసులకు సమాచారమందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నర్సింహా మృతదేహాన్ని వెలికితీసి..పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్‌, నర్సింహా ఇద్దరు సోదరులు కాగా..వారు సంగారెడ్డికి చెందినవారుగా తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2609
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles