మహిళ కత్తులతో ఇన్‌స్పెక్టర్‌ గదిలోకి వెళ్లి..

Thu,September 12, 2019 06:59 AM

Women enters inspectors room with knives in sr nagar ps

వెంగళరావునగర్‌: ‘మత్తు’లో ఓ మహిళ కత్తులతో ఇన్‌స్పెక్టర్‌ గదిలోకి వెళ్లింది. పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేయాలని కత్తి చేతపట్టుకుని హల్‌చల్‌ సృష్టించింది. అడ్డుకోబోయిన మహిళా పోలీస్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. చివరికి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి వద్ద నుంచి రెండు కత్తులు, ఆరు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..బల్కంపేటకు చెందిన మంజుల అలియాస్‌ హారిక(25)..తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని గత నెల 27న ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నింది తుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా..బాధిత మహిళ మూడు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చంద్రశేఖర్‌ తల్లిదండ్రులను కూడా అరెస్ట్‌ చేయాలని, అతన్ని విడిపించి తనకు పెండ్లి చేయాలని కోరింది. కాగా... ఇది వరకే పెండ్లి అయిన మంజులకు మద్యంతో పాటు డ్రగ్స్‌ అలావాటు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు మార్లు మహిళా పోలీసులు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మత్తులో ఉన్న మంజుల ఇన్‌స్పెక్టర్‌ గదిలోకి కత్తిచేత పట్టుకుని ప్రవేశించింది.

చంద్రశేఖర్‌ తల్లిదండ్రులను అరెస్ట్‌ చేస్తావా? లేదా? అంటూ ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి.. కత్తిని తన గొంతపై పెట్టుకుంది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ మహిళా కానిస్టేబుళ్లను పిలిచారు. వారు ఆమెను బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా గొడవ పడింది. దీంతో నలుగురు కానిస్టేబుళ్లలో అనుసూయ అనే మహిళా హోంగార్డు చేతికి గాయాలయ్యాయి. అనంతరం మహిళను తనిఖీ చేయగా ఆమె బ్యాగ్‌లో 2 కత్తులు, 6 సిమ్‌ కార్డులు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles