మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం..

Wed,September 11, 2019 09:03 PM

we works for trs victory in muncipolls says ktr


హైదరాబాద్ : టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 60లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలవారీగా పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు.

సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..పార్టీ సంస్థాగత బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలి. త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తమన్నారు. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles