కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శితో వినోద్ కుమార్ భేటీ

Wed,September 18, 2019 03:12 PM


న్యూఢిల్లీ: కృషి భవన్ లో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, ఇతర అధికారులతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ముల్కనూరు కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..రైతులు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రుణాలు పొందుతారని అన్నారు. వడ్డీ 7 శాతానికి ఎక్కువ కాకుండా రుణాలు ఇస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు సహకార బ్యాంకుల నుంచే కాకుండా కమర్షియల్ బ్యాంకుల నుంచి కూడా రుణం పొందాయన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సమారు 2.5 లక్షల మంది రైతులు రూ.550 కోట్ల రుణాలు పొందుతున్నారు. రైతులపై అధిక వడ్డీ భారం పడకుండా చూడాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారన్నారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles