టీవీ మీద పడి చిన్నారి మృతి

Mon,November 18, 2019 09:13 PM

పెద్దవూర : టీవీ మీదపడి చిన్నారి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. బట్టుగూడెం గ్రామానికి చెందిన దుర్గమ్మ వివాహం కనగల్ మండలం పర్వతగిరికి చెందిన శంకరయ్యతో 8 సంవత్సరల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దుర్గమ్మ తన కూతుర్లను తల్లిగారింట్లో ఉంచి హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చదువుతోంది. దుర్గమ్మ రెండో కూతురు స్మైలీ(18 నెలలు) తన అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటూ టీవీ వద్దకు వెళ్లి కేబుల్ వైరు పట్టుకు లాగింది. దీంతో టీవీ ఆమె మీద పడగా తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది.

1952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles