ఉత్తమ్‌ బీజేపీ ముందు మోకరిల్లాడు : ఎమ్మెల్సీ పల్లా

Fri,October 18, 2019 07:09 PM

సూర్యాపేట : హుజుర్‌నగర్‌లోకి కాంగ్రెస్‌ వృద్ధ జంబుకాలు, గోతికాడి నక్కలు గుంపులు, గుంపులుగా వచ్చి మొరుగుతున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎద్దెవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. ఈ ఉప ఎన్నికలో గెలవలేని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీ ముందు మోకరిల్లాడు. కేంద్రం అండతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇంత వరకు తమ కార్యకర్తల వద్ద ఒక్కపైసా కూడా దొరకలేదు. మూడు రోజుల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హుజుర్‌నగర్‌ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దేనని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.


నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోయిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. తాను వదిలిపెట్టిన మంత్రి పదవిని ఉత్తమ్‌ తీసుకున్నాడని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరిచిపోతే ఎట్లా? కోమటిరెడ్డి తప్పతాగి ఏది పడితే అది మాట్లాడితే డీ అడిక్షన్‌ సెంటర్‌కు పంపిస్తాం. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానకుంటే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామన్నారు. ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వం మీద గోల చేసిన బుడ్డెరఖాన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జైలు చిప్పకూడుకు అలవాటుపడ్డ రేవంత్‌ రెడ్డి మళ్లీ జైలుకు పోవడం ఖాయమన్నారు. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడగొట్టాం. పెద్ద నాయకుడిని అవుతానని రేవంత్‌రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలి. హుజుర్‌నగర్‌ ప్రజల తీర్పుతో రేవంత్‌ నాలుక కత్తిరిస్తాం. ఈ ఐదేళ్లలో ఉత్తమ్‌ అభివృద్ధి చేస్తే.. దానికి నిధులు ఇచ్చిందేవరు? అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles