ఘనంగా ఎమ్మెల్యే బాల్క సుమన్‌ జన్మదిన వేడుకలు

Fri,October 18, 2019 07:25 PM

హైదరాబాద్ : చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి నాయకులను చట్టసభలకు పంపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. భవిష్యత్తులో సుమన్‌ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. యువకెరటం సుమన్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు శ్యామ్‌, కరుణాకర్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, పెద్దమ్మ రమేశ్‌, హరిబాబు, రవి మేకల, జంగయ్య, కృష్ణ, నవీన్‌గౌడ్‌, శ్రీనివాస్‌పటేల్‌, నాగరాజు, కరుణాకర్‌, నాగేంద్రబాబు, పాదం తిరుపతి, గెల్లు అశోక్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

1141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles