మిలాద్ ఉల్ నబీ ర్యాలీ సందర్భంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Sat,November 9, 2019 09:57 PM

హైదరాబాద్ : మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు సాయంత్రం 6 గంటలకు వరకు పాతబస్తీతో పాటు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు కొనసాగనుండడంతో చాదర్‌ఘాట్ వద్ద ఆర్టీసి బస్సులను మళ్లిస్తారని, ఎస్‌జే రోటరీ, మిరాలం మండి రోడ్డు ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని వెల్లడించారు. ర్యాలీలో పాల్గొనేవారు తమ వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్‌లో పార్కు చేఆయలని సీపీ సూచించారు. ర్యాలీ కొనసాగే సమయంలో ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. బుధవారం పాతబస్తీలోని చార్మినార్. మొఘల్‌పురా, గుల్జార్ హౌస్, ఝాన్సీబజార్, సిటీ కాలేజీ, మదీనా, ఢిల్లీగేట్, దారుల్ షిఫా, చట్టబజార్, ఏపీఏటీ, పురాణహేవిలి, ఎతెబార్‌చౌక్, కోట్ల అలీజ పరిసర ప్రాంతాల మీదుగా ర్యాలీ వెళ్లనుంది. ర్యాలీల సందర్భంగా, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles