కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి

Mon,September 16, 2019 02:50 PM

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్పుగొండలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. బోరు మోటరు తీస్తుండగా పైన ఉన్న కరెంటు తీగలకు పైపు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మురళీధర్‌రావు(55), ఇమ్మడి నారాయణ(40), లక్ష్మణ్‌రావు(60)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు.

510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles