తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం

Sat,November 16, 2019 09:44 PM

నందికొండ: తెలంగాణ గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు క్రీడలు, యోగా శిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరు అద్వితీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల రాష్ట్రస్థాయి క్రీడలను గుత్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టులతో కలసి క్రీడాజ్యోతిని ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్రంలో 963 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటూ ఐఐటీ, ఎంసెట్ పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ అనురాధరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, టీఆర్‌ఎస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కర్న బ్రహ్మానందరెడ్డి, నాయకులు విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles