ఈ నెల 18,19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

Thu,July 11, 2019 08:31 PM

Telangana assembly special session held on july 18,19th


హైదరాబాద్ : తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న పురపాలక చట్టం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం నూతన పురపాలక చట్టం బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. చర్చ అనంతరం 19న శాసనసభ బిల్లుకు ఆమోదం తెలపనుంది. దీంతోపాటు మరోవైపు 19న శాసన మండలిలోనూ నూతన పురపాలక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయనున్నారు.

జులై 18న బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందజేసి, చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి.. జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించింది. ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎం తెలిపారు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్ట్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తమని చెప్పారు. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి న్యాయశాఖకు పంపామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles