రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు...

Tue,August 13, 2019 05:50 PM

State Tribal Advisory Council Establishment in Telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటైంది. గిరిజన సలహా మండలి ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం 20 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. అధికార సభ్యులుగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా, శిక్షణా సంస్థ సంచాలకులు, గిరిజన ఎంపీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 2019 ఆగస్టు 8వ తేదీ నుంచి మూడేళ్ల పాటు రాష్ట్ర గిరిజన సలహా మండలి కొనసాగనుంది.

925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles