శ్రీరాంసాగర్‌ గేట్లు ఎత్తివేత

Mon,October 21, 2019 11:21 AM

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరద కారణంగా ఉత్తర తెలంగాణ వరప్రధాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతున్నది. మూడేండ్ల తర్వాత ప్రాజెక్టు నుంచి దిగువకు వదులుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైన జూలై, ఆగస్టు నెలల్లో ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. సెప్టెంబర్‌లో భారీగా ఇన్‌ఫ్లో కొనసాగడంతో క్రమేపీ జలకళ సంతరించుకొన్నది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అముదుర, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టు లు నిండటంతో దిగువకు నీటిని వదిలారు. దీనికితోడు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని గోదావరి పరీవాహకంలో భారీగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొన్నది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం రాత్రికి ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులకు చేరుకొన్నది. దీంతో అధికారులు కాకతీయ కాల్వకు నీటిని వదిలా రు. కాల్వకు అనుసంధానంగా ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని మూడు టర్బయిన్లతో 22.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. గోదావరిలోకి ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు 25వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి పరివాహిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 60వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు మరిన్ని గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదలనున్నట్లు తెలిపారు.

4041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles