ప్రతీ నెలా గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు: ఎర్రబెల్లి

Wed,September 18, 2019 01:51 PM

హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాము స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రతీ నెలా గ్రామపంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన తాగునీరందిస్తున్నం. ప్రతీ ఇంటికి నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నం. గతంలో గ్రామపంచాయతీ నిధులు తాగునీటికే సరిపోయేది. కొత్తగా 6లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమని చెప్పారు.


చెక్ పవర్ విషయంలో సర్పంచ్ తోపాటు ఉపసర్పంచ్ కు ఇవ్వడం వల్ల ఉన్న ఇబ్బంది ఏంటని సభ్యులను మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు గ్రామానికి మంచి సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. నెలకోసారి గ్రామ సభ పెట్టాలని స్పష్టంగా చెప్పాం. సర్పంచ్ కు చాలా అధికారాలు ఇచ్చినం. నిధులిస్తున్నాం.. సర్పంచ్ గ్రామాల్లో ప్రైమరీ స్కూల్స్, అంగన్ వాడీల మీద పర్యవేక్షణ చేయాలి. పాత విద్యుత్ స్తంభాలు, వైర్లను తొలగించి..ఎల్ ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తున్నాం. నిధులిస్తున్నం..మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

1508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles