క్యాబ్‌ డ్రైవర్‌ కు రూ.27,165 ట్రాఫిక్‌ చలాన్లు..

Thu,September 12, 2019 06:51 AM

Rs 27,165 traffic challan collected from a Cab driver


హైదరాబాద్: గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ట్రాఫిక్‌ తనిఖీల్లో భాగంగా ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నుంచి స్థానిక పోలీసులు 119 పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన రమేశ్‌ క్యాబ్‌( TS07UA9202) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి నందుకు అతనికి 119 ట్రాఫిక్‌ చలాన్లు విధించారు. అయినప్పటికీ అతను కట్టలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ తనిఖీల్లో అతను దొరికిపోయాడు. దీంతో ఆ చలాన్లకు గాను మొత్తం రూ.27,165ను అతని నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్‌ ఎస్‌ఐ మక్బుల్‌ పాషా వసూలు చేశాడు.

928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles