వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం

Mon,December 2, 2019 09:12 PM


వరంగల్ అర్బన్: గిరిజన మైనర్ విద్యార్థినిపై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హనుమకొండ జులైవాడ ఎస్టీ హాస్టల్ లో చదువుకుంటున్న 14 ఏళ్ల విద్యార్థిని కళ్ళలో నీరు కారుతుంటి..ఆమె స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు రాజును శుక్రవారం రోజు సంప్రదించింది. బాలికను పరీక్షించిన వైద్యుడు రాజు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నట్లు నటించి మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు వదిలిన అనంతరం విషయాన్ని గ్రహించిన సదరు విద్యార్థిని ఏడ్చుకుంటూ హాస్టల్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఫోన్ లో ములుగు జిల్లాలో ఉండే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. సుబేదారి పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడు రాజు పై పోక్స్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

2067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles