హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ శీతలీకరణ యంత్ర ఉత్పత్తుల ప్రదర్శన ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఏర్పాటు కానున్నది. రెఫ్ కోల్డ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ ఇంజినీర్స్ సంస్థ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రెఫ్ కోల్డ్ ఇండియా చైర్మన్ జి.ఆనంద్‌కుమార్ మంగళవారం బేగంపేట్‌లోని మానస సరోవర్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. శతలీకరణ వ్యవస్థలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆహార ఉత్పత్తులు, మాంసం, ఫార్మా రంగాల్లో శీతలీకరణను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. సమావేశంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ ఇంజినీర్స్ సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.ఎస్.చంద్రశేఖర్, రాష్ట ప్రభుత్వ లాజిస్టిక్స్ డైరెక్టర్ రేపేశ్సింగ్, నోర్న్బెర్గ్ మెస్సే ఇండియా బోర్డు అధ్యక్షుడు ఎం.డి సోనియా ప్రషర్, ప్రదర్శన వేదిక చైర్మన్ డాక్టర్శ్రీకాంత్ పాపినేని తదితరులు పాల్గొన్నారు.