ప్రభుత్వ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స

Sat,November 9, 2019 09:22 PM

హుజురాబాద్‌ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కొన్నేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్న బొల్లు సునీతను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో పెద్ద కణతి(గడ్డ) ఉన్నట్లు గుర్తించారు. ప్రైవేట్ దవాఖానలో డబ్బులు పెట్టి శస్త్ర చికిత్స చేయించుకునే స్థోమతలేని సునీత గురించి దవాఖాన సూపరింటెండెంట్ వీ రవిప్రవీణ్‌రెడ్డి, ప్రముఖ జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పీ శ్రీకాంత్‌రెడ్డికి వివరించారు. దీంతో ఆయన గైనకాలజిస్ట్ మీనా, మత్తు వైద్యుడు హరగోపాల్, వైద్య సిబ్బంది శ్యామల, సారయ్యతో కలసి గంటపాటు వైద్యం చేసి కిలోన్నర కణతి(గడ్డ)ని తొలగించారు. అలాగే ఫైబ్రాయిడ్ అన్‌చూర్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతుండగా గర్భసంచిని తొలగించారు. గతంలో చిన్న చిన్న ఆపరేషన్లు మాత్రమే చేసే ఈ ప్రభుత్వ వైద్యశాలలో మొదటిసారిగా ఖరీదైన శస్త్ర చికిత్స ఉచితంగా చేసి మహిళ ప్రాణాలు కాపాడినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles