సహజ వనరులను రక్షించుకోవాలి: ఎంసీ మెహతా

Sat,November 9, 2019 10:15 PM

హైదరాబాద్ : సహజ వనరులు లేకుంటే మానవ మనుగడ అసాధ్యమని, ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ ఎంసీ మెహతా పేర్కొన్నారు. సహజ వనరులను మనం కాపాడుకుంటే.. అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. అభివృద్ధి పేరిట విచక్షణారహిత వినియోగం తగదని తెలిపారు. హైదరాబాద్‌లోని పెండేకంటి న్యాయ కళాశాలలో నిర్వహించిన క్లైమేట్ చేంజ్- ఎన్విరాన్‌మెంటల్ లా అండ్ మేనేజ్‌మెంట్ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రజాఉద్యమం రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షుడు పీ రామ్మోహన్‌రావు అధ్యక్షత వహించగా ఉస్మానియా న్యాయవిభాగం డీన్ ప్రొఫెసర్ పంత్‌నాయక్, పెండేకంటి న్యాయకళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జయకుమార్, డాక్టర్ ఆరతి త్యాగి తదితరులు పాల్గొన్నారు.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles