చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ

Wed,August 21, 2019 10:10 PM

P Chidambaram taken away in a car by CBI officials

ఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గంటసేపు హైడ్రామా తర్వాత సీబీఐ అదుపులోకి తీసుకుంది. చిదంబరాన్ని కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం దరఖాస్తు చేసుకోగా ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను నిరాకరించిన సంగతి తెలిసిందే. అరెస్టుకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లు మూసివేశారు. దీంతో సీబీఐ సిబ్బంది గోడదూకి లోపలికి ప్రవేశించి ఢిల్లీ పోలీసుల సహాకారంతో చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఈ రాత్రికి చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles