సుప్రీం తీర్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

Sat,November 9, 2019 02:47 PM

హైదరాబాద్: వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం నేడు తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ అసదుద్దీన్ స్పందిస్తూ.. తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందన్నారు. ఐదు ఎకరాల స్థలం కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తీర్పు పట్ల సంతృప్తిగా లేనని చెప్పడం తన హక్కు అన్నారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ లేదా ఐదు ఎకరాలా అనేది పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.

3691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles