కోడెల ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు

Mon,September 16, 2019 03:41 PM

హైదరాబాద్‌: కొన్ని గంటల క్రితం మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ రావు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని డీసీపీ శ్రీనివాస్‌ అన్నారు. క్లూస్‌ టీంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డసీపీ మాట్లాడుతూ.. ఆయన బెడ్‌రూంలో కిందపడి ఉంటే అతని భార్య, కుమార్తె, డ్రైవర్‌ కలిసి బసవతారకం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన బతికించడానికి వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మెడపై చిన్న గాయం కనిపిస్తోందని డీసీపీ అన్నారు. శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.


కొన్ని రోజులుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన అన్నారు. కాగా, ఆయన ఇంట్లో ప్రస్తుతం ఆయనతో పాటు భార్య, కూతురు, పనిమనిషి మాత్రమే ఉన్నట్లు సమాచారం.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles