ఉత్తమ్‌ దంపతులకు పరాభవం తప్పదు

Fri,October 18, 2019 08:07 PM

-టీఆర్‌ఎస్‌కు అద్భుత ఆదరణ
-గిరిజినుల సంక్షేమానిక పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌


సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, ఉత్తమ్‌ దంపతులకు పరాభవం తప్పదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో ప్రచారం నిర్వహించి అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిలు ఎమ్మెల్యేలుగా ఉండి ఎన్నడు ప్రజా సమస్యల గురించి ఆలోచించలేదని, నిత్యం జనమధ్య ఉండే సైదిరెడ్డికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని తెలిపారు. 2018 ఎన్నికలో ట్రక్కు గుర్తు అయోమయానికి గురిచేసిందని, ఉప ఎన్నికల్లో సైతం అదే ట్రక్కు దాపురించిందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత ప్రజలను, గిరిజనులను చైతన్య పరుస్తున్నామని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యనికి గురై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి రుణం తీర్చుకుందామన్నారు. తండాలకు రోడ్డు వేయించే బాధ్యత తనదని, అవసరమైన ఇండ్లు కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. తన ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నుంచి అభివృద్ధికి కట్టుబడి ఉంటాని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని చాలా తండాలు సైదిరెడ్డికే తమ మద్దతు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయని, మిగతా గ్రామాలు అదేతీరుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌, ఎంపీపీ తాళ్ళూరి లక్ష్మీనారాయణ, ఖమ్మం కార్పొరేటర్‌ పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles