డీజీపీ మహేందర్‌రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ

Mon,December 2, 2019 07:12 PM


హైదరాబాద్‌: డీజీపీ మహేందర్‌రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పేందుకు షీటీమ్స్‌ ద్వారా ఏర్పాట్లు చేయాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. విద్యార్థినులపై దాడులు జరుగకుండా..సమస్యను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అవగాహన కల్పించాలి. ఆపదలో ఎవరిని ఆశ్రయించాలనే విషయంపై వారిని చైతన్యపర్చాలి. హెల్ప్‌లైన్లపై విద్యార్థినిలకు పూర్తి అవగాహన కల్పించాలి. మహిళలు, విద్యార్థినులు ఫిర్యాదు చేస్తే..వెంటనే చర్యలు చేపట్టాలి. సోషల్‌మీడియాలో వచ్చే ఫిర్యాదులపై పోలీసులు స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి నిర్దేశించారు.

4126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles