శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Wed,September 11, 2019 12:38 PM

Minister puvvada ajay kumar Visits Tirumala  temple

తిరుమల శ్రీవారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో రెండోవ సారి శాసన సభ్యుడిగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాపై నమ్మకంతో తెలంగాణాలో రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటానన్నారు. ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని‌ ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖలో నూతన‌ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన స్పష్టం చేశారు.

706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles