ధాన్యం నిల్వ గోదాంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Fri,November 8, 2019 03:00 PM

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో నిర్మించిన ధాన్యం నిల్వ గోదాంను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ గోదాంను రూ. 3 కోట్లతో నిర్మించారు. గోదాం సామర్థ్యం ఐదు వేల మెట్రిక్‌ టన్నులు. ఆ తర్వాత జిల్లెల్ల గ్రామంలోనే ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్‌ పనులకు కేటీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ సెంటర్‌ను రూ. 5.71 కోట్ల నిధులతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లుతో పాటు పలువురు పాల్గొన్నారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles