గోపాలమిత్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Tue,November 19, 2019 12:49 PM

ఆదిలాబాద్ : బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలం పిప్పేలకోటి గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇవాళ పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. రూ. 8 లక్షల నిధులతో నిర్మించిన గోపాల మిత్ర భవనాన్ని ప్రారంభించారు. దళిత బస్తి పథకం కింద మంజూరైన 85 మంది లబ్దిదారులకు భూపట్టాలను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి నీరు అందుతుందన్నారు. పిప్పెలకోటి ఎత్తిపోతల పథకం ద్వారా భూములు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశామన్నారు. పిప్పేలకోటి గ్రామంలో బ్రిడ్జి, రోడ్డు, ఆర్చి నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, నాయకులు సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బోథ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles