మిషన్‌ భగీరథపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

Mon,October 21, 2019 01:07 PM

నిర్మ‌ల్ : మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్మ‌ల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మిషన్‌ భగీరథ ప‌నుల పురోగ‌తిపై సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి అత్యంతప్రాధాన్యత నిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ఆశయమని, దానికనుగుణంగా ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలతో వేగంగా పని చేయించుకోవాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, విఠ‌ల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, నిర్మ‌ల్ జ‌డ్పీ చైర్ ప‌ర్సన్ విజ‌య‌ల‌క్ష్మి, ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ద‌న్, జిల్లా క‌లెక్ట‌ర్లు యం.ప్ర‌శాంంతి, దివ్య దేవరాజన్, ఇఎన్సీ కృపాక‌ర్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles