ఎస్సీ ఎస్టీలకు సకాలంలో రుణాలు అందించాలి

Thu,December 5, 2019 08:04 PM

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు కే రాములు జిల్లా అధికారులను సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఎస్సీ,ఎస్టీ ల నిధుల పై, అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులు, జిల్లా పోలీసు అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేవలం స్త్రీల కాలనీలలో అభివృద్ధికి వారి సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు.


ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని, అంబేద్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో జరిగిన అత్యాచారాలు, రేప్ కేసులు, భూ సమస్య కేసులను నిర్మల్ బైంసా ఆసిఫాబాద్ డిఎస్పి లతో అడిగి తెలుసుకున్నారు కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిబంధనల మేరకు చర్యలు గైకొనాలి అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్లో దళిత బస్తీ కింద జిల్లాలో ఎంత మందికి భూములు కేటాయించారు, ఎంతో మందికి రుణాలు అందించారు అని ఎస్సీ కార్పొరేషన్ అధికారిని, చట్టప్రకారం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అధికారిని, జిల్లాలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి ఎన్ని మహిళలు ఎన్ని రేషన్ షాపులు కేటాయించారని జిల్లా పౌరసరఫరాల అధికారిని వివరాలు సేకరించారు.

జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కన్నా మెరుగ్గా విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు. జిల్లాలోని అధికారులందరూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి తో పాటు జిల్లా అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎవరైనా అత్యాచారానికి గురైన వెంటనే ఆ కుటుంబానికి మూడు నెలలపాటు రేషన్ అందజేయాలని, కుటుంబంలోని ఒకరికి పెన్షను అందచేయాలని సూచించారు. ఫిర్యాదు దారులకు న్యాయం అందేలా జిల్లా అధికారులు పోలీసులు చూడాలన్నారు. దళితుల భూములు అన్యాక్రాంతం కాకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈ సమావేశంలో నిర్మల్, కొమరం భీమ్ జిల్లా కలెక్టర్లు ఎం ప్రశాంతి, రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా ఎస్పీలు శశిధర్ రాజు, ఏం మల్లా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె భాస్కర్ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్ యాదవ్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి మాణిక్యరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles