మల్లన్న సన్నిధిలో మహాకుంభాభిషేకం

Mon,November 18, 2019 10:07 PM

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునుడి క్షేత్రంలో మహాకుంభాభిషేకం ప్రారంభమైంది. ఐదురోజులపాటు జరిగే పూజల్లో భాగంగా తొలిరోజు ఆలయ ఆవరణలోని ప్రత్యేక యాగశాలలో అర్చకులు,వీరశైవ ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి మహాకుంభాభిషేకం సందర్భంగా ఆగమ పండితుల మంత్రోత్సరణలతో మల్లన్న పుణ్యక్షేత్రం మార్మోగింది.


ఆలయ రాజగోపురం నిర్మించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. చేశారు. స్వామి వారి క్షేత్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించే కుంభాభిషేక మహాఘట్టానికి కర్ణాటకలోని ఉజ్జయిని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 జగద్గురువు సిద్దిలింగరాజా దేవీకేంద్ర శివాచార్య స్వామిజీ ఈనెల 21వ రాత్రికి కొమురవెల్లికి చేరుకొని 22న నిర్వహించే పూజల్లో పాల్గొననున్నారు.

444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles