తెలంగాణకు దార్శనికుడు సీఎం కేసీఆర్ : మండలి చైర్మన్ గుత్తా

Thu,September 12, 2019 11:55 AM

Legislative Council Chairmen Gutha Sukhender reddy praises on CM KCR

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. దర్శన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి దార్శనికుడు అని తెలిపారు. సీఎం కృషి వల్ల యాదాద్రి ఆలయం ప్రపంచ ఖ్యాతి గడించేలా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఉంది. తెలంగాణ సిద్ధించింది కాబట్టే యాదాద్రిని గొప్పగా నిర్మించుకోగలిగాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నరసింహస్వామిని కోరుకున్నాను అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles