కొనసాగుతోన్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

Thu,September 12, 2019 09:12 AM

khairatabad ganesh shobhayatra continues


హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. మహాగణపతి నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. మధ్యాహ్నం కల్లా మహాగణపతి నిమజ్జనం కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నారు. మహాగణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై క్రేన్ సిద్దం చేశారు.

శోభాయాత్ర సాగుతుందిలా..


* సెన్సేషన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌, ఎక్బాల్‌ మినార్‌, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా సాగుతుంది.
* ఉదయం 10.30గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం 6 వద్దకు మహాగణపతి చేరుకుటుంది.
* ఉదయం 9.30గంటల నుంచి 10.30గంటల వరకు ట్రాలీపై ఉన్న విగ్రహం చుట్టూ వెల్డింగ్‌ పనులతో జాయింట్లను తొలగిస్తారు.
* ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల వరకు గంగా హారతి, స్వామి వారికి పూజలు చేస్తారు.
* 12.30 నుంచి 1గంట మధ్య క్రేన్‌ సాయంతో విగ్రహాన్ని సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.


మహాగణపతిని తరలించేందుకు భారీ ట్రాలీ..


ఖైరతాబాద్ మహాగణపతిని శోభాయాత్రగా తీసుకెళ్లేందుకు భారీ ట్రాలీని వినియోగిస్తున్నారు. 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ ట్రాలీకి 28 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును ఇది సునాయసంగా ఎన్ని కిలోమీటర్లయిన మోసుకెళ్తుంది. ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్టు వారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఖైరతాబాద్‌ గణేశుడికి ఉచితంగా ఈ ట్రాలీని అందచేస్తూ వస్తున్నారు.


400 టన్నులను అవలీలగా మోస్తుంది..


జర్మన్‌ టెక్నాలజీతో రూపొందించిన ఈ క్రేన్‌లో హైడ్రాలిక్‌, రిమోట్‌ కంట్రోలింగ్‌ సిస్టం అమర్చారు. 14మీటర్ల పొడువు, నాలుగు మీటర్ల వెడల్పు ఉండే ఈ క్రేన్‌కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు బరువు టన్ను ఉంటుందని క్రేన్‌ ఆపరేటర్‌ దేవేందర్‌ సింగ్‌ చెప్పారు. 72 టన్నుల బరువు ఉండే ఈ క్రేన్‌కు అమర్చిన జాక్‌ 14 మీటర్ల పైగా పొడవు సాగుతుంది. 400 టన్నుల బరువును అవలీలగా ఎత్తుతుంది. 45 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్‌ ద్వాదశాదిత్య మహాగణపతి విగ్రహాన్ని చెక్కు చెదరకుండా నిమజ్జనం చేస్తారు. ఈ క్రేన్‌ను మోడ్రన్‌ క్రేన్‌ సంస్థ వారు ఉచితంగా అందచేస్తున్నారు.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles