కాళేశ్వరం – తెలంగాణ ప్రగతి రథం పుస్తకావిష్కరణ

Thu,December 5, 2019 07:08 PM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్ల రికార్డు సమయంలోనే రైతాంగానికి నీటిని సరఫరా చేసే దశకు చేరుకున్న నిర్మాణ ఘట్టాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి చరిత్రకు అందించడం హర్షణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రగతిభవన్ లో సీఎం ఓఎస్డీ (నీటిపారుదల శాఖ) శ్రీధర్ రావు దేశ్ పాండే రాసిన ‘‘ కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే సమగ్ర గ్రంథాన్ని రాశారని రచయిత దేశ్ పాండేను అభినందించారు.


కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి సీఎం కేసీఆర్ దీక్షతో చేసిన కృషిని, ఒక ఇంజనీర్ కంటే ఎక్కువగా, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ ని, కేంద్ర జలసంఘం వారి గోదావరి ప్రవాహ లెక్కలను ఉపయోగించి చేసిన పరిశోధనల్నింటినీ ఈ గ్రంథంలో రచయిత నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరీశంకర్, కాళేశ్వరం ఈ.ఎన్.సి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles