విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యం..

Thu,November 14, 2019 06:57 AM

రావిరాల జడ్పీ పాఠశాలలో ఖోఖో పాటీలు ప్రారంభించిన జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి
తుక్కుగూడ: విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలు కూడా ఎంతో అవసరమని రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి అన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిరాల జడ్పీపాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో విద్యార్థులు ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఏర్పాటు చేయనుందన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలకు ఎక్కడా క్రీడా స్థలాలు లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఆట స్థలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. 65వ అండర్- 17 బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం వరకు జరుగనుండగా, 250 మంది విద్యార్థులు, 45 మంది పీఈటీలు ఆయా స్కూళ్ల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక ప్రధానోపాధ్యాయులు రఘు, రాఘవరెడ్డి, భాస్కర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు రవీందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, సురేశ్, టీఆర్‌ఎస్ నాయకులు రాజు, చంద్రశేఖర్‌రెడ్డి పలు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, రాఘవేందర్ రెడ్డి, రఘు, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , విజయ్ తదితరులు పాల్గొన్నారు.

255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles