6200 మెట్రిక్‌ టన్నుల నిమజ్జన వ్యర్థాలు

Mon,September 16, 2019 06:44 AM

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాల వెలికితీత పనులు పూర్తయ్యాయి. దాదాపు పది రోజులపాటు వ్యర్థాల తొలగింపు పనులను నిర్విరామంగా కొనసాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలగింపు పనుల్లో హెచ్‌ఎండీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 1000మంది లేబర్లు, 60 సూపరువైజర్లు, 28 జేసీబీలు, ఆధునిక యంత్రాలు ఎక్సావేటర్‌, ట్రాష్‌ కలెక్టర్‌, డ్రెజ్జింగ్‌ యుటిలిటీ క్రాప్టు (డీయూసీ) యంత్రాలు పూర్తిగా నీళ్లలోనే ఉండి సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా క్షణాల్లోనే వెలికితీసి నమూలంగా గట్టుకు చేర్చారు. గతే డాది 6100 మెట్రిక్‌ టన్నుల మేర వ్యర్థాలను తీసిన అధికారులు ఈ సారి 6200 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles