శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Thu,December 5, 2019 07:55 PM

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారంను డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల నుంచి పేస్టు రూపంలో ఉన్న ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యక్తి తమకు బంగారం ఇచ్చినట్లు నిందితులు తెలిపారు.

1259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles