యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కేటీఆర్

Mon,September 16, 2019 11:02 AM

హైదరాబాద్: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయి. స్టార్టప్‌లు ప్రారంభోత్సవంలో నెలకొన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యేలు సుమన్, వివేక్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాయదుర్గం ప్రాంతంలో రూ.276 కోట్లతో మూడు ఎకరాల్లో టీ హబ్-2ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. టీ హాబ్ దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహాబ్2 ఉండబోతోంది. గోవా, ఢిల్లీ, అసోం రాష్ర్టాలకు టెక్నాలజీ సహాకారం అందిస్తున్నాం. టీ హాబ్ -2తో నాలుగు వేలకు పైచిలుకు మంది యువతకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోనే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఐటీ రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరిస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles