హైదరాబాద్: వారం రోజుల క్రితం అంబర్‌పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గోడ కూలి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన మాజిద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.