గణేష్ మండపాల అనుమతులు ఆన్‌లైన్‌లోనే...

Wed,August 21, 2019 10:44 PM

go online for ganesh mandap permission in hyderabad

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రులు, నిమజ్జనానిని సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ జీహెచ్‌ఎమ్‌సీ, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక శాఖ, ఆర్‌టీఏ, ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు, డీఎమ్‌హెచ్‌ఓ, ఇరిగేషన్, భాగ్యనగర్ ఉత్సవ సమితీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 2వ వినాయక పండుగ, 12న నిమజ్జనం ఉంటుందన్నారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు పలు మార్గదర్శకాలను సూచించారు.


*గణేష్ మండపాల నిర్వహాకులు అనుమతి కోసం www.cyberabadpolice.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
*మండపాలు ఏర్పాటు చేసే వారు స్థల యజమానుల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. మండపం ట్రాఫిక్ లేదా ప్రజలకు ఇబ్బందిగా ఉండొద్దు.
*మండపాల వద్ద విద్యుత్ షాక్‌లు ఏర్పడకుండా నాణ్యతతో కూడిన వైరింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
*ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
* బాణాసంచా పేల్చడం నిషేదం.
*లౌడ్ స్పీకర్‌ల ఏర్పాటుకు స్థానిక పీఎస్ నుంచి అనుమతి తీసుకోవాలి.
*డిజే స్పీకర్స్‌కు అనుమతి లేదు. బాక్స్ టైప్ స్పీకర్‌లను ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు స్పీకర్ వాడకం నిషేదం.
*మండపాల వద్ద రాత్రి సమయాల్లో ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి.
*భవనాల సెల్లార్‌లలో ఏర్పాటు చేసే మండపాలకు, ఉరేగింపులకు పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలి.
*నిమజ్జనం జరిగే ప్రతి చెరువు వద్ద నిష్ణాణుతులైన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తాం.
*పండుగ పేరుతో ఎవరు బలవంతంగా చందాలు, హఫ్తాలు వసేలు చేయొద్దు.
*నిర్వాహకులు, కాలనీ పెద్దలు, సామాజిక సేవకులు, పీస్ కమిటీ సభ్యులు పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయపర్చుకుని ప్రశాంత వాతావరణాన్నికి కృషి చేయాలి.
*సైబరాబాద్ పరిధిలో 29 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుంది. ఇవి జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో-21, మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో-2, రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో-6 చెరువులు వస్తాయి.
*సెప్టెంబరు 12న జరిగే నిమజ్జనం కోసం 54 స్టాటిక్ క్రేన్స్, 22 మొబైల్ క్రేన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
*జిల్లా వైద్యాధికారులు అంబులెన్స్ సర్వీసులు, మెడికల్ క్యాంపులను నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
*టూరిజం శాఖ అధికారులు బోట్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతారు.
*అనుమతి లేకుండా విద్యుత్ సరఫరాను చేసుకునే వారిని టీఎస్‌సీపీడీసీఎల్ అధికారులు గుర్తిస్తారు. విద్యుత్ అంతరాయం లేకుండా పని చేస్తారు.
*ఆర్ అండ్ బీ శాఖ అధికారులు నిమజ్జనానినిక అవసరమైయ్యే సదుపాయాలను కల్పిస్తారు. బ్యారికేడ్లను అందిస్తారు.
*నిమజ్జనం ప్రాంతం, నిమజ్జనంక వెళ్ళే మార్గంలో ఉండే అడ్డంకులను తొలగించడం, నిమజ్జనం దగ్గర ప్లాట్‌ఫాంలను నిర్మించడాన్ని జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లు పర్యవేక్షిస్తారు.
*అగ్నిమాపక శాఖ అధికారులు 36 పోర్టబుల్ ఫైర్ బ్రిగేడ్స్, 21 ఫైర్ ఇంజిన్‌లను అందుబాటులో పెడతారు.
*నిమజ్జన ప్రాంతాల్లో హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు తాగేందుకు మంచి నీరు సౌకర్యం కల్పిస్తారు.
*ఐ అండ్ పీఆర్ అధికారులు సూచనలు అందించేందుకు లౌడ్ స్పీకర్స్‌ను ఏర్పాటు చేస్తారు.
*టీఎస్‌ఆర్‌టీసీ ఆధ్వర్యంలో 36 డ్రైవర్లు, 18 మంది మెకానిక్ లను అందించి బ్రేక్ డౌన్ వాహనాలను తొలగించి నిమజ్జనానికి ఆటంకాలు లేకుండా చేస్తారు.
*మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్‌లు నిమజ్జన ప్రాంతాల్లో 30 జనరేటర్‌లను ఏర్పాటు చేసి రాత్రి నిరవధికంగా వీధి దీపాలను వెలిగేలా చూస్తారు.
కార్యక్రమంలో మేడ్చల్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, హరిచందన జీహెచ్‌ఎమ్‌సీ జోనల్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎమ్ విజయ్‌కుమార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి,బాలానగర్ డీసీపీ పద్మజ, అదనపు రవాణా శాఖ కమిషనర్ ప్రవీన్‌రావు, స్పెషల్ బ్రాంచి అదనపు డీసీపీ గౌసు మొయినుద్దీన్, రంగారెడ్డి జిల్లా డీఆర్‌ఓ ఉషా, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఏసీపీలు, ఇన్స్‌పెక్టర్‌లు పాల్గొన్నారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles