దోమలపై సరైన సమాధానాలు చెబితే లక్ష బహుమతి

Tue,August 13, 2019 10:00 PM

ghmc mosquito app questions and answers win one lakh

హైదరాబాద్ : నగరంలో అంటు వ్యాధుల నివారణ, చైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈనెల 16వ తేదీనుంచి 26వ తేదీవరకు గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో 600ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటుచేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్ తెలిపారు. ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ, ఆరోజు ఎక్కడా దోమలు గుడ్లు పెట్టేందుకు వీలులేకుండా నీటి నిల్వలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు చేపట్టిన చర్యలపై హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యశాఖ, మలేరియా విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దోమల నివారణ చర్యల్లో ఎంటమాలజీ విభాగానికి చెందిన 650బృందాలు పాల్గొంటున్నట్లు చెప్పారు. నగరంలో 600మెడికల్ క్యాంపులు నిర్వహించాలని లక్ష్యం కాగా, అందులో ఇప్పటికే 400క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రైవేటు దవాఖానాలపై ఫిర్యాదులు....


సాధారణ జ్వరానికి సైతం డెంగ్యూ జ్వరం వచ్చినట్లు పేర్కొంటూ అమాయకులనుంచి భారీగా సొమ్ము గుంజుతున్నట్లు ప్రైవేటు దవాఖానాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు కమిషనర్ తెలిపారు. అందుకే మూడు జిల్లాల వైద్యాధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి కార్పొరేట్ దవాఖానాల్లో డెంగ్యూ జ్వరాలపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

లక్ష బహుమతి...


దోమల వ్యాప్తి వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన మస్కిటో యాప్‌ను ఎనిమిది లక్షలమందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. అందులో ఉండే 17ప్రశ్నలకు సరియైన సమాధానాలు అందించేవారిలో లాటరీ ద్వారా 10మందిని ఎంపికచేసి ఒక్కొక్కరికి రూ. 10వేల చోప్పున నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఈ యాప్ మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో పొందుపర్చినట్లు కమిషనర్ వివరించారు.

2044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles