సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దు: జీహెచ్‌ఎంసీ

Wed,October 9, 2019 03:12 PM

హైదరాబాద్: నగర పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.


నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ ఒపెన్ చేసే ప్రయత్నం చేయవద్దని, జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం ప్రారంభమైంది.

8898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles