జనరల్‌, స్టూడెంట్‌ బస్‌పాస్‌ ఛార్జీలు కూడా పెరిగాయి..

Mon,December 2, 2019 02:46 PM

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలతో పాటు జనరల్‌, స్టూడెంట్‌ బస్‌పాస్‌ ఛార్జీలను కూడా పెంచారు. సిటీ ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ. 770 నుంచి రూ. 950కి పెంపు, మెట్రో పాస్‌ ఛార్జీ రూ. 880 నుంచి రూ. 1070కి పెంపు, మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ. 990 నుంచి రూ. 1180కి పెంచారు. ఎన్జీవోలకు సంబంధించి సిటీ ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ. 260 నుంచి రూ. 320కి పెంపు, మెట్రో పాస్‌ ఛార్జీ రూ. 370 నుంచి రూ. 450కి పెంపు, మెట్రో డీలక్స్‌ పాస్‌ ఛార్జీ రూ. 480 నుంచి రూ. 575కి పెంచారు. ఎంఎంటీఎస్‌ - ఆర్టీసీ కాంబో టికెట్‌ ధరలను రూ. 880 నుంచి రూ.1090కి పెంచారు.


స్టూడెంట్‌ రూట్‌ పాస్‌(క్వార్టర్లీ) ఛార్జీ రూ. 130 నుంచి రూ. 165కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైస్కూల్‌, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్‌(క్వార్టర్లీ) పాస్‌ ఛార్జీని రూ. 235 నుంచి రూ. 310కి పెంచారు. హైస్కూల్‌, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్‌(మంత్లీ) పాస్‌ ఛార్జీని రూ. 85 నుంచి రూ. 115కి పెంచారు.

హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల పరిధిలో స్టూడెంట్‌ జనరల్‌ బస్‌ టికెట్‌(ఎస్‌జీబీటీ) ఛార్జీలను పెంచారు. ఎస్‌జీబీటీ(మంత్లీ) పాస్‌ ఛార్జీలను రూ. 130 నుంచి రూ. 165కు, ఎస్‌జీబీటీ(క్వార్టర్లీ) పాస్‌ ఛార్జీలను రూ. 390 నుంచి రూ. 495కి పెంచారు. ఎస్‌జీబీటీ స్పెషల్‌(మంత్లీ) పాస్‌ ఛార్జీలను రూ. 210 నుంచి రూ. 260కి, ఎస్‌జీబీటీ స్పెషల్‌(క్వార్టర్లీ) పాస్‌ ఛార్జీలను రూ. 630 నుంచి రూ. 780కి పెంచారు.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles