శాఖల సమన్వయంతో నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు: డీజీపీ

Wed,September 11, 2019 07:37 PM

Ganesh immersion with departments coordination says dgp mahender reddy

హైదరాబాద్: నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. గణేష్ నిమిజ్జన ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా వినాయక విగ్రహాలు నెలకొల్పారన్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పటిష్టంగా ఏర్పాట్లు చేశామన్నారు. భద్రతకు మూడు కమిషనరేట్లలో కలిపి 35 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి విజయవంతంగా నిమజ్జనాలను పూర్తి చేస్తామన్నారు. సాధారణ పౌరులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శోభాయాత్రలు జరగని వేరే మార్గాల మీదుగా వాహనాల దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. నిమజ్ఞనం పూర్తైన విషయాన్ని మండపం నిర్వాహకులు పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీసులంతా అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. దాడుల గురించి ఏ సంస్థ నుంచి కూడా హెచ్చరికలు రాలేదని డీజీపీ తెలిపారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles